సాయి పల్లవి చెప్పిన ఆసక్తికర విషయాలు..!

381
Sai Pallavi
- Advertisement -

శర్వానంద్ కథానాయకుడిగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన ‘పడి పడి లేచె మనసు’ నిన్ననే థియేటర్లకు వచ్చింది. సాయిపల్లవి కథానాయికగా నటించిన ఈ సినిమా, రొమాంటిక్ లవ్ స్టోరీగా ప్రేక్షకులను పలకరించింది. ఇందులో సాయి పల్లవి పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్యూలో పాల్గొన్న ఈ అందాల భామ ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

Sai Pallavi

‘పడి పడి లేచె మనసు’ సినిమాలో నటించడం ఎంతో సంతృప్తిగా ఉంది. నటిగా నేను అందరికీ గుర్తుండాలంటే మంచి పాత్రలే చేయాలి. పది, ఇరవయ్యేళ్ల తర్వాత నా పిల్లలు కూడా నా సినిమా చూసి సంతోషించాలి కదా. ఇప్పుడు అమ్మానాన్నలు నా సినిమాల్ని చూసి గర్వపడాలి. వైద్యవృత్తిని వదిలేసినా అందరికీ వినోదం పంచే ఓ మంచి పని చేస్తోందనే తృప్తి వాళ్లలో కనిపించాలి. అందుకే తొందరేమీ లేకుండా నచ్చిన కథలతోనే ప్రయాణం చేస్తున్నా’’ అని తెలిపింది.

Sai Pallavi

అంతేకాదు ప్రేమ గురించి మాట్లాడుతూ..ఎవరైనా ప్రేమలో పడకుండా ఉండగలమా? ఆ ప్రేమ దేనిపైన, ఎంత స్థాయిలో ఉందనేదే కీలకం. ప్రస్తుతానికి నాకు సినిమాపై పిచ్చి ప్రేముంది. ఇక కాలేజీలో ప్రేమంటారా? మెడిసిన్‌ చదివే హడావుడిలో ప్రేమ గురించి ఆలోచించలేదు. అయితే స్కూల్‌లో ప్రేమ మాత్రం గుర్తుంది. నన్ను ఎవరో గమనిస్తున్నట్లు అనిపించేది. మొహంపై మొటిమలతో ఉన్నా కూడా నన్ను చూస్తున్నారా, ఇష్టపడుతున్నారా అనిపించేది. అంతే కానీ సీరియస్‌ ప్రేమంటూ లేదు. అని తెలిపింది.

- Advertisement -