పవన్ కళ్యాణ్ ఇంతవరకు నటించిన సినిమాల్లో ది బెస్ట్ మూవీ ఏదంటే వెంటనే వచ్చే ఏకైక ఆన్సర్ తొలిప్రేమ. పవన్ కళ్యాణ్ ని పవర్ స్టార్ గా మార్చేసిన ఈ సినిమాకు ఇప్పటికీ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ప్రేమకథా చిత్రాల్లో ఓ కొత్త ఒరవడి తీసుకొచ్చిన తొలిప్రేమని రీమేక్ చేస్తున్నారనే న్యూస్ ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది.
సాయిధరమ్ తేజ్ బీవీఎస్ రవి దర్శకత్వంలో రూపొందిన ‘జవాన్’ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే, తేజు మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. కరుణాకరన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ‘తొలి ప్రేమ’ కాన్సెప్ట్ కి దగ్గరగా ఈ సినిమా ఉంటుందని కరుణాకరన్ చెప్పాడు. దీంతో ఇది ‘తొలి ప్రేమ’ రీమేక్ అనే టాక్ ఫిల్మ్ నగర్‌లో జోరుగా వినిపిస్తోంది.
‘తొలి ప్రేమ’తో 1998లో పవన్ కి కరుణాకరన్ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు. అప్పట్లో ఈ సినిమా కొత్త ట్రెండ్ ను సృష్టించింది. ఆ తరువాత ఆ స్థాయి సక్సెస్ ను కరుణాకరన్ అందుకోలేకపోయాడు. ఇక ఈ మధ్య కాలంలో సాయిధరమ్ తేజ్ కి సరైన హిట్ పడలేదు. దర్శకుడికి .. హీరోకి ఇద్దరికీ కూడా సూపర్ హిట్ అవసరం కావడంతో, ‘తొలి ప్రేమ’ను రీమేక్ చేస్తున్నారని టాలీవుడ్ వర్గాల సమాచారం.