ఫస్ట్ లుక్‌తో రానున్న ‘తెనాలి రామకృష్ణ’

310
sundeep kishan
- Advertisement -

యంగ్ హీరో సందీప్ కిష‌న్ న‌టిస్తున్న ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్‌ ‘తెనాలి రామ‌కృష్ణ బీఏ బీఎల్‌’. తెలుగు, త‌మిళంలో ఏక కాలంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ మే 7న విడుద‌ల కానుంది. జి.నాగేశ్వ‌ర‌రెడ్డి ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పూర్తి కామెడీ నేపథ్యంలో వినోదాన్ని పంచడానికి వస్తుండగా ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తైంది.

సందీప్ కిషన్ సరసన హాట్ బ్యూటీ హ‌న్సిక హీరోయిన్‌గా న‌టిస్తోంది. త‌మిళ న‌టి వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. భూమిక చావ్లా,ముర‌ళీ శ‌ర్మ‌, బ్ర‌హ్మానందం, వెన్నెల కిశోర్ త‌దితరులు ఇత‌ర కీలక పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

సాయికార్తీక్ సంగీతాన్ని అందిస్తుండగా సాయి శ్రీరామ్ ఈ చిత్రానికి కెమెరామేన్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. శ్రీ నీల‌కంఠేశ్వ‌ర స్వామి క్రియేష‌న్స్ ప‌తాకంపై ఈ చిత్రం తెర‌కెక్కుతోంది.

- Advertisement -