సాహో రాజమౌళి

19
- Advertisement -

ఎన్నాళ్ళో వేచిన హృదయం అంటూ వేచిన తెలుగు వారికి ఆస్కార్ సొంతమయ్యే సరికి తెలుగు వాడే కాకుండా ప్రతీ భారతీయుడు గర్వపడ్డాడు. అయితే మన తెలుగు పాటకి ఆస్కార్ అంత ఈజీగా రాలేదు. దీని వెనుక ఒక వ్యక్తి మొండి పట్టుదల ఉంది. అతడే జక్కన్న అలియాస్ రాజమౌళి. నిజానికి RRR నుండి నాటు నాటు సాంగ్ రిలీజ్ అవ్వగానే వచ్చిన రెస్పాన్స్ చూసి రాజమౌళి ఈ సాంగ్ లో మేజిక్ ను కనిపెట్టేసి దీన్ని గొప్ప స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించేసుకున్నాడు. అయితే ఆస్కార్ నామినేషన్ అనుకొని ,ఓ సందర్భంలో వై నాట్ ఈ సాంగ్ ను ఎందుకు అకాడెమీ అవార్డ్స్ నామినేషన్స్ కి పంపకూడదు ? అనే మొండి పట్టుదలతో తొలి అడుగేశాడు. అయితే నామినేషన్ కెళ్లాడానికే కోట్లు ఖర్చవుతుందని తెలుసుకొని మెల్లగా కోట్లు కుమ్మరించాడు. అమెరికాలో కొన్ని నెలలు పాగా వేశాడు. అక్కడ సినిమా షోలు వేస్తూ వచ్చాడు. సాంగ్ ను ముందు నుండే వరల్డ్ కి దగ్గర చేసెయ్యడంతో పని కాస్త ఈజీ అయింది. నాటు నాటు ను మరింత ప్రమోట్ చేస్తూ ఆ సాంగ్ లో ఉన్న మేజిక్ ను ఆమెరికన్స్ కి డ్రగ్ లా ఎక్కించేశాడు.

పార్టీలు , మీడియా మేనేజ్ మెంట్, పీఆర్ ఏజెన్సీస్ , యాక్టర్స్ ట్రావెలింగ్ ఇలా అన్నీ ప్లాన్ చేసుకొని ఒక్కసారిగా రంగంలో దిగాడు. తనయుడు కార్తికేయతో కలిసి చకచకా చేసేసుకున్నాడు. అమెరికాలో తెలుగోడి సత్తా చాటాలని బలమైన సంకల్పం ఒకటి పెట్టేసుకొని ప్రమోషన్ మొదలు పెట్టాడు. ఈ ప్రాసెస్ జరుగుతున్నంత సేపు అసలు నామినేషన్స్ వరకూ నాటు నాటు వెళ్తుందా ? అని అందరూ అనుకున్నారు. కానీ నామినేషన్స్ లో నాటు నాటుని పెట్టాల్సిందే అని రాజమౌళి డిసైడ్ అయిపోతే ఇంక ఆగుద్దా ? అదే జరిగింది. నామినేషన్ లో కి వెళ్ళాక కూడా నాటు నాటు పై రకరకాల మాటలు. అసలు ఈ సాంగ్ కి ఆస్కార్ వచ్చే అవకాశం లేదంటూ నామినేషన్స్ వరకూ వెళ్లాడమే ఎక్కువ అన్నట్టుగా చాలా మంది మాట్లాడుతూనే ఉన్నారు. అయినా పట్టు వదలని విక్రమార్కలా రాజమౌళి అవార్డు అందుకోవాల్సిందే అని అక్కడే పాగా వేసి ఫైనల్ గా ఇప్పుడు అకాడమీ ఆస్కార్ అవార్డు సాదించేశాడు.

నాటు నాటుకి ఆస్కార్ రావడానికి సాంగ్ కంపోజ్ చేసిన కీరవాణి ప్రతిభ , అలాగే చక్కని సాహిత్యం అందించిన చంద్రబోస్ టాలెంట్ , చరణ్ , తారక్ లతో అదిరిపోయే కొరియోగ్రఫీ చేసిన ప్రేమ్ రక్షిత్ కారణం కావొచ్చు కానీ వీటన్నిటి కంటే ఆస్కార్ వరకూ పాట ను తీసుకెళ్లగలిగిన మొండితనంతో కూడిన మాస్టర్ మైండ్ ఉంది. ఆ మైండ్ పేరు ఎస్ ఎస్ రాజమౌళి. ఇంత వరకూ రాజమౌళిను ఆస్కార్ విషయంలో తక్కువ అంచనా వేసినా అందరూ ఇప్పుడు రాజమౌళి నా మజాకా అనుకునేలా చేశాడు జక్కన్న. దట్ ఈజ్ రాజమౌళి.

ఇవి కూడా చదవండి…

రామ్ చరణ్ కోసం దర్శకుడి వెయిటింగ్

దసరా విజయం నానికి కీలకం!

దీపికా..82°E అంటే ఏంటంటే..?

- Advertisement -