దసరా విజయం నానికి కీలకం!

38
- Advertisement -

నేచురల్ స్టార్ నానికి హిట్ , ఫ్లాప్ కి సంబంధం లేకుండా ఓ క్రేజ్ ఉంది. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ నాని సినిమాలు బాగా ఇష్టపడతారు. అందుకే ఈ హీరో నుండి ఎన్ని డిజాస్టర్స్ వచ్చినా దసరా కి మంచి బిజినెస్ జరిగింది. జెర్సీ తర్వాత నాని నుండి వచ్చిన గ్యాంగ్ లీడర్ , వీ , టక్ జగదీష్ సినిమాలు ఘోరంగా దెబ్బ తిన్నాయి. వీ ఓటీటీ లో రిలీజై తప్పించుకుంది లేదంటే థియేటర్స్ లో ఆ సినిమాకి కలెక్షన్ నిల్ గా ఉండేవి. అయితే శ్యామ్ సింగరాయ్ తో మళ్ళీ ఓ హిట్ కొట్టాడు నాని.

కానీ శ్యామ్ సింగ రాయ్ వచ్చిన అంటే సుందరనికీ నాని నమ్మకాన్ని ఒమ్ము చేసింది. ఈ సినిమాతో నాని మళ్ళీ ఓ ఫ్లాప్ చూడాల్సి వచ్చింది. దర్శకుడు నిడివి అనుకున్నట్టు ఉంచేయడం కూడా కలెక్షన్స్ మీద ప్రభావం చూపించింది. అయితే ఇప్పుడు కెరీర్ లో ఎన్నడూ చేయని ఓ డిఫరెంట్ మూవీ దసరా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు నాని.

ఈ నెల 30న థియేటర్స్ లోకి రాబోతున్న ‘దసరా’ మీద నాని చాలా నమ్మకం పెట్టుకున్నాడు. ఈ సినిమా తన కెరీర్ లో ఓ బిగ్ టర్నింగ్ పాయింట్ అవుతుందని మాస్ కి దగ్గర చేస్తుందని భావిస్తున్నాడు. పాన్ ఇండియా లెవెల్ లో భారీ ప్రమోషన్స్ చేసుకుంటున్నాడు. అయితే ఈ సినిమాను శ్రీకాంత్ అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేశాడు. శ్రీకాంత్ సుకుమార్ దగ్గర వర్క్ చేశాడు. మరి సుక్కు శిష్యుడు నానికి బ్లాక్ బస్టర్ ఇచ్చి మళ్ళీ ట్రాక్ లోకి తీసుకొస్తాడా ? చూడాలి.

ఇవి కూడా చదవండి…

శ్రీదేవి శోభన్‌బాబు..ఓటీటీలోకి ఏప్పుడంటే..?

దీపికా..82°E అంటే ఏంటంటే..?

ప్రభాస్ తో  సంథింగ్.. నథింగ్ అట 

- Advertisement -