శర్వానంద్ తో సాహో దర్శకుడు!

349
sharwanand Sujeeth

రన్ రాజా రన్ వంటి బ్లాక్ బాస్టర్ సినిమాతో కి దర్శకుడిగా పరిచయమయ్యాడు సుజిత్. ఈసినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సాహో సినిమాను తెరకెక్కించాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్ట్ 30న విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈమూవీ అనుకున్నంత విజయం సాధించలేదు. దీంతో ఈదర్శకుడి వైపు నిర్మాతలెవరూ చూడటం లేదు.

అయితే ప్రభాస్ అంచనాలను ఈ సినిమా అందుకోలేకపోయింది. కథ లేకుండా ఖర్చు పెట్టించాడనే విమర్శలు వినిపించాయి. ఇదిలా ఉండగా సుజీత్ హీరో శర్వానంద్ కోసం మంచి ప్రేమకథను రెడీ చేశాడట. ఈ కథను త్వరలోనే శర్వానంద్ కు వినిపించనున్నాడట దర్శకుడు సుజీత్. శర్వానంద్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే, సుజీత్ తదుపరి సినిమా ఆయనతోనే ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన రన్ రాజా రన్ మూవీ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Sahoo Movie Director Sujeeth Next Movie With Sharwanand