కోల్ కతా డే అండ్ నైట్ టెస్టు….సర్వం సిద్ధం

430
kohli

కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్‌ వేదికగా నవంబర్ 22న రెండో టెస్టు ప్రారంభం కానుంది. భారత్ ఆడనున్న తొలి డే/నైట్‌ టెస్ట్‌ మ్యాచ్‌ కావడంతో అందరి దృష్టి ఈడెన్‌ గార్డెన్‌పై పడగా కోల్ కతా మొత్తం గులాబీమయమైంది. బీసీసీఐ చీఫ్‌ సౌరవ్‌ గంగూలీ ఈ మ్యాచ్‌ కోసం పింకూ-టింకూ అనే మస్కట్‌ను ఆవిష్కరించాడు. భారీ పింక్‌ బెలూన్‌ను కూడా మైదానంలో ఎగిరేశారు. ఇది మ్యాచ్‌ పూర్తయ్యేదాకా అక్కడే ఉండనుంది.

ఇప్పటికే మ్యాచ్ టిక్కెట్లు అన్ని అమ్ముడుపోవడంపై సంతోషం వ్యక్తం చేశాడు గంగూలీ. క్రికెట్ పరంగా చూస్తే ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద దేశం. అయితే ఇక్కడ మైదానాలకు ప్రేక్షకులను రప్పించడమే అసలైన సవాల్ అన్నారు.

పిచ్‌ మంచి స్థితిలోనే ఉంది. పచ్చిక కాస్త ఎక్కువగానే ఉంచాం. మ్యాచ్‌ అద్భుతంగా సాగుతుందన్న నమ్మకం ఉందని ఈడెన్‌ గార్డెన్‌ క్యూరేటర్‌ సుజన్‌ ముఖర్జీ పేర్కొన్నాడు.

BCCI president Sourav Ganguly asserted that the Indian skipper (Virat Kohli) will be happy to see a full house when he leads India out at Eden Gardens