Shakunthalam:నా ఆఫర్‌ను రిజెక్ట్‌ చేసిన ఇప్పుడు వదల్లేదు.!

55
- Advertisement -

శాకుంతలం సినిమా ప్రమోషన్‌లో భాగంగా దర్శకుడు గుణశేఖర్‌ డైలాగ్ కింగ్ మోహన్‌బాబుపై కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ఓ సినిమా కోసం మోహన్‌బాబును ఆఫర్‌ చేసిన రిజెక్ట్‌ చేశారని తెలిపారు. కానీ శాకుంతలం సినిమా కోసం ఒప్పించడానికి ప్రయత్నించలేదని అన్నారు. అంతేకాదు శాకుంతలం సినిమాలో దుర్వాస మహర్షి పాత్ర కోసం మోహన్‌బాబును ఎంచుకోవడంపై పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు.

ఈ సందర్బంగా గుణశేఖర్ మాట్లాడుతూ..శాకుంతలం సినిమాకు మోహన్‌బాబు నా ఛాయిస్‌ కాదని అన్నారు. అంతేకాదు మహాకవి కాళిదాసు ఛాయిస్‌ ఎందుకంటే కాళిదాసు వర్ణన చదివిన తర్వాత..దుర్వాస మహర్షి మోహన్‌బాబు మాత్రమే నూటికి నూరు శాతం న్యాయం చేయగలరని అనిపించింది. అయితే నేను గతంలో రుద్రమదేవిలో ఓ పాత్రకు అడిగితే ఆయన సున్నితంగా తిరస్కరించారు. దాంతో ఆరోజు ఆయన్ని బలవంతం చేయలేదు. కానీ ఈ సినిమా కోసం ఆయన్ని కలిసి…సర్‌ ఈ సారి మీరు నో చెప్పలేని పాత్రతో వచ్చాను.

ఒక వేళ చేయను అని మీరు అంటే ప్రత్యామ్నాయం ఎవరో మీరే చెప్పండి అని అడిగాను అని తెలిపారు. దానికి ఆయన ప్రాజెక్ట్‌ వివరాలు తెలుసుకున్నారు. దీంతో ఆయన్ని పెద్దగా నవ్వి…కోపిష్టి అని నా వద్దకు వచ్చావా? అని అడిగారు. దుర్వాసునిలో కోపం ఒక్కటే గుణం కాదు..ఆయనో గొప్ప మహర్షి అని బదులిచ్చా అని గుణశేఖర్ చెప్పుకొచ్చారు. వెంటనే నేను ఈ పాత్ర చేస్తున్నా అని అంగీకారం తెలిపారు. అని గుణశేఖర్‌ వివరించారు.

ఇవి కూడా చదవండి…

Vikram:ఒకే స్టేజీపై విక్రమ్‌, రోలెక్స్‌..!

Ram Charan: భార్యతో చరణ్ దుబాయి వెకేషన్

దేవకన్యలా మెరిసినా కాసులు కురిపించగలదా?

- Advertisement -