119 ఏళ్ల నాటి కారులో సచిన్‌ … షికారు

512
sachin london
- Advertisement -

సెలబ్రెటీలు,రాజకీయ నాయకులకు కార్లు,బైకులంటే ఎంతో క్రేజ్‌ అన్న సంగతి తెలిసిందే. ఇక జార్ఖండ్ డైనమెన్ ధోని గురించి చెప్పాల్సిన పనిలేదు. ధోని కలెక్షన్స్‌లో లేని బైకు ఉండదంటే అతిశయోక్తి కాదేమో. కొంతమందికి కార్లు కొని నడపడం సరదా అయితే మరికొంతమందికి ఖరీదైన కార్లు నడపడం సరదా. తాజాగా సచిన్‌ సైతం ఓ పాత మోడల్ కారుని నడిపి తెగ ఎంజాయ్ చేశారు.

అదికూడా 119 ఏళ్ల నాటి వింటేజ్ కారు. ప్రపంచకప్‌లో భాగంగా లండన్‌లో ఉన్న సచిన్‌ భార్య అంజలితో కలిసి లండన్‌ రోడ్లలో షికార్ చేస్తున్నారు. ఇందులో భాగంగా దాదాపు 120 సంవత్సరాల క్రితం నాటి కారును సచిన్‌ నడిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కారు ముందుభాగంలో సచిన్ వింటేజ్ కారు డ్రైవ్ చేస్తుండగా .. వెనుక సీట్లో అంజలి కుర్చుంది. కారు గేర్లను మారుస్తు సచిన్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అయితే ఈ కారు స్పీడ్ ఎంతో తెలుసా .. గంటకు 28 కిలోమీటర్ల వేగంతో మాత్రమే వెళ్తుంది. దీనికి సంబంధించిన వీడియోను సచిన్ కూడా ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేశారు.

- Advertisement -