ప్రైవేట్ టీచర్లకు సాయంపై మంత్రి సబితా రివ్యూ…

128
sabitha indra reddy
- Advertisement -

రాష్ట్రంలోని ప్రైవేట్ టీచర్లకు సీఎం కేసీఆర్ రూ. 2 వేలు,25 కిలోల బియ్యాన్ని సాయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సర్వత్రా హర్షం వ్యక్తమవుతుండగా ప్రైవేటు ఉపాధ్యాయులు, సిబ్బందికి ప్రభుత్వం అందిస్తామన్న సాయంపై మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్‌ శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఇందుకోసం నెలకు రూ. 42 కోట్లు అవసరమవుతాయని తెలిపారు సబితా. ఈ సందర్భంగా అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మంత్రులు సమీక్ష చేపట్టారు. ఏప్రిల్‌ నుంచే ప్రైవేట్‌ టీచర్లకు సాయం అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు.

ప్రైవేటు విద్యాసంస్థల్లో 1.45 లక్షల మంది పనిచేస్తుండగా రేషన్‌ దుకాణాలవారీగా లబ్దిదారులను గుర్తించాలని, ఏర్పాట్లు సిద్ధం చేయాలని కలెక్టర్లు, అధికారులను మంత్రులు ఆదేశించారు.

- Advertisement -