పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాల వారీగా ప్రత్యేక బడ్జెట్ రూపొందించుకోవాలని సూచించారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో పంచాయతీ సమ్మేళనంలో పాల్గొన్న సబితా ఇంద్రారెడ్డి..రంగారెడ్డి జిల్లాలోని ప్రతీ గ్రామం ఆదర్శ గ్రామంగా, స్వచ్ఛ, పచ్చని గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు.
కొత్త పంచాయతీ రాజ్ చట్టం రూపొందించడంతో పాటు గ్రామాల అభివృద్ధికి సంబంధించి అధికారులకు, ప్రజాప్రతినిధులకు ప్రభుత్వం నిధులు, విధులు కేటాయించిందని తెలిపారు. ప్రతీ గ్రామానికి ఒక కార్యదర్శని నియమించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. తడి పొడి చెత్తను వేరు చేసి డంపింగ్ యార్డు లైన్ వేయాలన్నారు.
గ్రామాలను ఆదర్శంగా తిర్చిదిద్దాలనే ప్రధాన ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామాలు సమగ్రంగా అభివృద్ధి చెందేలా కలసికట్టుగా పని చేయాలని సూచించారు. నిరక్షరాస్యులందరిని అక్షరాస్యులుగా చేసే భాద్యత చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, జిల్లా పరిషత్ ఛైర్మెన్ అనితా హరినాధ్ రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్య, జైపాల్ యాదవ్, అంజయ్య యాదవ్, మంచి రెడ్డి కిషన్ రెడ్డి, జడ్పి వైస్ చైర్మన్ గణేష్, అదనపు కలెక్టర్, ప్రతీక్ జైన్, జిల్లా అధికారులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.