8 నెలల్లో 1800కి పైగా అత్యాచారాలు: సబితా

6
- Advertisement -

రాష్ట్రంలో గత 8 నెలల్లో మహిళలపై 1800 పైగా అత్యాచారాలు, అఘాయిత్యాలు జరిగాయన్నారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. మహిళలు అంటే ఒక చులకనభావంగా ఈ పరిపాలన జరుగుతుందన్నారు. మహిళల పట్ల హత్యాచారాలు జరుగుతున్నా ఈ ముఖ్యమంత్రికి స్పందించడానికి తీరిక కూడా లేదు అని మండిపడ్డారు.

గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఆదివాసీ మహిళను పరామర్శించారు మాజీ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మేల్యేలు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే కోవా లక్ష్మి.

ఈ సందర్భంగా హరీశ్‌ రావు మాట్లాడుతూ..ముఖ్యమంత్రి దగ్గరే హోం శాఖ ఉందన్నారు. ప్రతి రోజూ 2 హత్యలు, 4 మానభంగాలు అన్నట్టు అయ్యిందని..ఈ రోజు ముఖ్యమంత్రి వరద విపత్తు సహాయంలో ఫెయిల్, లా అండ్ ఆర్డర్, రుణమాఫీ, విద్యా వ్యవస్థను నడిపించడంలో ఫెయిల్ అయ్యారు. మొత్తానికి ముఖ్యమంత్రి ఫెయిల్ అయ్యాడు అన్నారు. ఎంత సేపు ప్రతిపక్షాలను వేధించడం, అక్రమ కేసులు పెట్టడం తప్ప పాలనను గాలికి వదిలేశాడని ఆరోపించారు.

Also Read:Harishrao: రైతు ఆత్మహత్య బాధాకరం

- Advertisement -