మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘ఆచార్య’. ఈ సినిమాలో కాజల్, పూజా హెగ్డే కథానాయికలుగా నటిస్తున్నారు. రామ్ చరణ్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈమూవీ ఫిబ్రవరి 4న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్‌లో భాగంగా ‘సానా కష్టం వచ్చిందే మందాకినీ’ అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను రేపు (సోమవారం) సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేయబోతున్నారు.
తాజాగా ఈ సాంగ్‌కు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ పాటలో మెగాస్టార్ వింటేజ్ స్టెప్పులు కనిపించాయి. 66 ఏళ్ల వయసులో కూడా అదిరిపోయే డాన్సులతో మాయ చేశాడు చిరు. ఈ పాటలో రెజీనా స్టెప్పులేసింది. అందాల ఆరబోతతో పిచ్చెక్కించింది రెజీనా. ఈ పాట చిత్రీకరణ జరిగి కూడా చాలా రోజులైపోయింది. శేఖర్ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ అందించాడు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. దేవాలయ భూముల కుంభకోణం నేపథ్యంలో సాగే సందేశాత్మక చిత్రమిది.