తల్లి కాబోతున్న కాజల్ అగర్వాల్..!

25

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ త్వరలో తల్లి కానుంది. ఈ విషయాన్ని కాజల్‌ భర్త గౌతమ్‌ చెప్పకనే చెప్పాడు. నిన్న న్యూ ఇయర్‌ సందర్భంగా.. కాజల్ అభిమానులకు, నెటిజెన్స్ కు గౌతమ్ ఒక హింటిచ్చాడు. కాజల్ అగర్వాల్ ఫోటోను షేర్ చేస్తూ తాము 2022 సంవత్సరం గురించి ఎదురుచూస్తున్నామని మెసేజ్‌ను జతచేశాడు. కాజల్ గర్భిణీ అనేలా ఫోటోతో సంకేతం కూడా ఇచ్చాడు. దీనికితోడు కాజల్ బేబీ బంప్స్ పై చెయ్యేస్తూ మరో ఫోటో కూడా పోస్ట్ చేశాడు. దాంతో భార్య కాజల్ అగర్వాల్ ప్రెగ్నెంట్ అనే విషయాన్ని గౌతమ్ కిచ్లూ ఇండెరెక్ట్‌గా చెప్పినట్టు అర్ధమవుతోంది.

అలాగే కాజల్ సైతం తన అభిమానులకు విషెస్ తెలుపుతూ పోస్ట్ పెట్టింది. దాంతో ఆ వార్తకు మరింత బలం చేకూరింది. ఇప్పుడు ఈమె బేబీ బంప్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటి వరకు తన గర్భం గురించి అధికారికంగా ప్రకటించలేదు కాజల్ అగర్వాల్. కానీ ఈమె గర్భం దాల్చిన ఫోటోలు ఇప్పుడు బయటికి వచ్చాయి. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.