సామ్.. ఎందుకు మంచులక్ష్మిలా ?

40
- Advertisement -

ఏమాయ చేసావే సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయమైంది సమంత. తొలి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా.. తన నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. ప్రస్తుతం ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ ప్రచారంలో భాగంగా సమంత, బాలీవుడ్ హీరో వరుణ్‌ధావన్‌తో కలిసి లండన్ వెళ్లింది. ఈ సందర్భంగా సమంత మీడియాతో మాట్లాడారు. అయితే, సమంత హాలీవుడ్ యాక్టర్ల యాసను అనుకరిస్తూ మాట్లాడడంతో ఆమెపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

‘నీకంత స్టైల్ అవసరమా. ఎందుకు మంచులక్ష్మిలా సాగదీసి వయ్యారాలు పోవడం. నువ్వు కొరియాకు పోతే కొరియా యాసలో ఇంగ్లీష్ మాట్లాడతావా’ అని నెటిజన్లు సమంత పై వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు హీరో సాయి ధరమ్ తేజ్ తనకు సమంత అంటే క్రష్ అని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. సమంత అంటే క్రష్ అని చెప్పి… చైతును బ్రదర్ అని ఎలా అంటున్నావ్ ? అంటూ సాయి ధరమ్ తేజ్ పై కూడా నెటిజన్లు మండి పడుతున్నారు.

Also Read: సుమ గొంతు పట్టుకున్న హీరో..అసలు ఏమైంది..!

ఇంతకీ, సాయి ధరమ్ తేజ్ ఈ కామెంట్స్ ఎప్పుడు చేశాడు అంటే.. విరూపాక్ష విజయానందంలో ఫ్యాన్స్‌తో ట్విట్టర్‌లో చిట్ చాట్ చేశాడు. ఈ సందర్భంగా వారు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సాయి తేజ్ సమాధానాలు చెప్పాడు. తనకు సమంత అంటే క్రష్ అని చెప్పుకొచ్చాడు. మొత్తానికి ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు రూపంలో సమంత చాలా యాక్టివ్‌గా ఉంది.

Also Read: అక్టోబర్ నుంచి రామ్ తో షురూ

- Advertisement -