జులై 27న సాక్ష్యం గ్రాండ్ రిలీజ్..!!

256
Saakshyam grand release
- Advertisement -

సాక్ష్యం మూవీ రిలీజ్ విషయంలో మీడియాలో వస్తున్న రూమర్స్‌కి చెక్ పెట్టేస్తూ సినిమా నిర్మాతలు రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేశారు.. ప్రపంచ వ్యాప్తంగా జులై 27 న సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించారు.. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్ భారీ మొత్తాన్ని చెల్లించి ఈ సినిమా యొక్క ప్రపంచవ్యాప్త థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకుంది.యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్, గ్లామర్ డాల్ పూజ హెగ్డే నటిస్తున్న ఈ సినిమా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందగా ప్రకృతిలోని పంచభూతాలు అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో రూపొందింది.

Saakshyam grand release

ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ బాగుండటంతో సినిమాపై అంచనాలు బాగానే పెరిగాయి. సాంగ్స్ కి కూడా అద్భుతమైన స్పందన వచ్చింది..ముఖ్యంగా 12 నిమిషాల పంచభూతలు సాంగ్‌కి మంచి ఆదరణ లభిస్తోంది..హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించిన ఈ సినిమాలో జగపతి బాబు, శరత్ కుమార్, రావు రమేష్, రవి కిషన్, అశుతోష్ రాణా, పవిత్రా లోకేష్, వెన్నెల కిషోర్ మరియు మీనాలు నటించగా అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పతాకంపై అభిషేక్ నామ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Saakshyam grand release

తారాగణం: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే, శరత్ కుమార్, మీనా, జగపతి బాబు, రవి కిషన్, అశుతోష్ రాణా, మధు గురు స్వామి, జే ప్రకాష్, పవిత్రా లోకేష్ మరియు వెన్నెల కిషోర్.. సాంకేతిక నిపుణులు : దర్శకుడు: శ్రీవాస్, బ్యానర్: అభిషేక్ పిక్చర్స్, నిర్మాత: అభిషేక్ నామా,సంగీత దర్శకుడు: హర్షవర్ధన్ రామేశ్వర్, డిఓపి: ఆర్థర్ ఎ విల్సన్ ,కళ: ఎఎస్ ప్రకాష్, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర రావు, మాటలు: సాయి మాధవ్ బుర్రా, యాక్షన్: పీటర్ హెయిన్, పిఆర్ఓ: వంశీశేఖర్, సాహిత్యం: అనంత శ్రీరామ్, ఆడియో: జంగిల్ మ్యూజిక్.

- Advertisement -