KCR:రైతు సంఘటిమవ్వాల్సిన సమయమిది:కేసీఆర్‌

54
- Advertisement -

దేశంలో రైతు శక్తికి బీఆర్ఎస్ తోడు ఉంటుందని సీఎం కేసీఆర్ అన్నారు. రైతు శక్తిని సంఘటితం చేసే శక్తి కేవలం బీఆర్ఎస్ పార్టీకే ఉందని స్పష్టం చేశారు. ఈ దేశంలో 14మంది ప్రధానులు మారినా ప్రజల తలరాతను మాత్రం మార్చలేకపోయారని కేసీఆర్ పేర్కొన్నారు. మ‌హారాష్ట్ర షెట్కారీ సంఘ‌ట‌న్ రైతు నేత శ‌ర‌ద్ జోషి ప్ర‌ణీత్ తో పాటు పలువురు రైతు నేత‌లు బీఆర్ఎస్ పార్టీ లో చేరారు.

ఈ సంద‌ర‌భంగా వారంద‌రికీ సీఎం కేసీఆర్ గులాబీ కండువాలు క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌లో చేరిన మ‌రాఠా రైతు సంఘం నేత‌ల‌కు సాద‌ర స్వాగ‌తం. రైతుల పోరాటం న్యాయ‌బ‌ద్ధ‌మైన‌ది. త‌లచుకుంటే సాధ్యం కానిదంటూ ఏమీ ఉండ‌దు. చిత్త‌శుద్ధితో ప‌ని చేస్తే గెలిచి తీరుతామని అన్నారు. నా 50 ఏండ్ల రాజ‌కీయ అనుభ‌వంలో ఎన్నో అటుపోట్లు ఎదుర్కొన్నాను. తెలంగాణ‌లో ఏం చేశామో మీరంతా ఒక‌సారి చూడండి.

కాళేశ్వ‌రం ప్రాజెక్టును సంద‌ర్శించండి అని కేసీఆర్ రైతు నేత‌ల‌కు సూచించారు. న‌ల్ల చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా ఉద్య‌మించిన రైతుల‌ను ఉగ్ర‌వాదుల‌న్నారు.. ఖ‌లీస్తానీల‌న్నారు.. వేర్పాటువాదుల‌న్నారు. రైతుల పోరాటంతో మోదీ దిగివ‌చ్చి క్ష‌మాప‌ణ చెప్పారు. వ్య‌వ‌సాయాన్ని సుస్థిరం చేశాక రైతుల ఆత్మ‌హ‌త్య‌లు ఆగుతాయన్నారు. రైతుల గోస చూసి నాకు క‌న్నీళ్లు వ‌చ్చేవని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

ఈ కార్య‌క్ర‌మంలో బీఆర్ఎస్ కిసాన్ స‌మితి జాతీయ అధ్య‌క్షుడు గుర్నామ్ సింగ్ చ‌డునీ, మ‌హారాష్ట్ర కిసాన్ స‌మితి అధ్య‌క్షుడు మాణిక్ క‌దం, మంత్రులు స‌త్య‌వ‌తి రాథోడ్, హ‌రీశ్‌రావు, ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డితో పాటు ప‌ల‌వురు నేత‌లు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి…

GreenIndiaChallenge:గ్రీన్ ఇండియా సృష్టికర్తకు గ్రీన్ రిబ్బన్ అవార్డు

Covid:మూడు వేలకు చేరువలో కరోనా కేసులు…

RamKiBandi:వరల్డ్ ఫేమస్ రామ్‌ కీ బండి

- Advertisement -