- Advertisement -
తెలంగాణ రైతులకు శుభవార్త. నేటి నుండి రైతుల రుణమాఫీ ప్రక్రియ రెండో విడత ప్రారంభంకానుంది. తొలి విడతలో రూ.25 వేల వరకు రుణం తీసుకున్న వారి రుణాలను మాఫీ చేయగా నేటి నుండి 50 లక్షల లోపు రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేయనుంది.
తొలివిడతలో 3 లక్షల మంది అన్నదాతలకు లబ్ది చేకూరగా రెండో విడతలో ఏకంగా 6 లక్షల మందికిపైగా రైతులకు లబ్ది చేకూరనుంది. రైతు రుణమాఫీ కోసం 2 వేల5 కోట్ల 85 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసింది ప్రభత్వం. ఈనెల 30 వరకు 25 వేల నుంచి 50 వేల వరకు రుణాలున్న రైతులకు రుణాలు మాఫీ చేయనుంది ప్రభుత్వం.
రైతుబంధులా రైతుల ఖాతాలలో నిధులు జమ చేసినట్లుగానే.. 25, 26, 27 వేల చొప్పున రుణాలు మాఫీ అవుతాయి. ఈ మేరకు రైతుల ఖాతాలలో నిధులు జమ చేస్తుంది ప్రభుత్వం. 2014 నుంచి 2018 వరకు మొత్తం 16 వేల 144 కోట్లు ఖర్చు చేసింది ప్రభుత్వం.
- Advertisement -