యూట్యూబ్ ట్రెండింగ్‌లో ‘భీమ్లా నాయక్’

71
pawan
- Advertisement -

పవర్‌ స్టార్‌ ప‌వ‌న్ క‌ల్యాణ్, రానా ద‌గ్గుబాటి కాంబినేష‌న్‌లో ‘అయ్య‌ప్ప‌నుమ్ కొషియుమ్’ రీమేక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సినిమా టైటిల్‌ని రివీల్ చేశారు. ఫస్ట్ గ్లింప్స్‌గా భీమ్లా నాయక్‌ టైటిల్‌ని ఖరారు చేయగా మాస్ లుక్‌తో అదరగొట్టారు పవన్.

ప‌వ‌న్ బ్లాక్ క‌ల‌ర్ ష‌ర్ట్‌, లుంగీలో ఫైటింగు చేస్తూ, కోపంతో ఊగిపోతూ ఇందులో క‌న‌ప‌డుతున్నారు. ఒరేయ్ డానీ బ‌య‌ట‌కు రారా.. నా కొడ‌కా అని పిలుస్తూ ఆయ‌న ఫైటింగ్ చేస్తున్నారు. ఈ సినిమాలో డానీగా రానా న‌టిస్తున్న‌ట్లు తెలుస్తోంది. విడుదల చేసిన కొద్ది గంటల్లోనే యూ ట్యూబ్‌లో ట్రెండింగ్‌గా మారింది. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 12న సినిమా విడుదల కానుంది.

- Advertisement -