పుష్పకు తప్పని లీకుల బెడద..!

129
pushpa
- Advertisement -

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం తొలి పార్టు క్రిస్మస్ కానుకగా విడుదల కానుండగా ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఊరమాస్ సాంగ్‌తో ఫ్యాన్స్‌కు కిక్కెంచారు అర్జున్.

అయితే ఇప్పటివరకు బాగానే ఉన్నా తాజాగా పుష్ప సినిమాకు సంబంధించిన ఫైట్‌ సీన్ లీకవడం మేకర్స్‌ని కలవర పెడుతోంది. 20 సెక‌న్ల వీడియో లీక్ కాగా, ఇందులో అల్లు అర్జున్, ర‌ష్మిక క‌నిపిస్తున్నారు. బ‌న్నీ మెట‌ల్ చైర్‌తో గూండాని కొడుతున్నట్టుగా ఉంద‌ట‌. దీంతో పోలీసులను ఆశ్రయించారు మైత్రీ మూవీ మేకర్స్‌.

మా చిత్రాలకు సంబంధించిన కంటెంట్ ఆన్ లైన్ లో లీక్ కావడం మమ్మల్ని తీవ్రంగా కలచివేసింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపై ఇప్పటికే ఫిర్యాదు చేశాం అని తెలిపింది. ఈ తరహా ధోరణితో తమను ఇబ్బందులకు గురిచేయడమే కాకుండా, ప్రేక్షకులకు అందాల్సిన థ్రిల్ ను చంపేస్తున్నారని వివరించింది.

- Advertisement -