- Advertisement -
వ్యవసాయరంగంలో స్వర్ణయుగానికి బాటలు తీస్తూ.. రైతుబాంధవుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మదిలో మెదిలిన అపూర్వ ఆలోచన రైతుబంధు. తెలంగాణ రైతాంగం కళ్లలో వెలుగును, జీవితాల్లో భరోసాను, కొండంత ధైర్యాన్ని నింపే ఈ పథకం నిరాటంకంగా కొనసాగుతోంది. తొలుత ఎకరం భూమి నుండి రైతు బంధు పంపిణీ జరుగుతుండగా 7వ రోజు 2,09,924 రైతులకు లబ్దిచేరనుంది. ఇవాళ 9 ఎకరాలు ఉన్నవారికి రైతు బంధు వేయనున్నారు.
నేరుగా రైతుల ఖాతాల్లోకే డబ్బులు జమకానుండగా ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. మొత్తం ఈ సీజన్‌కు 63,25,695 మంది రైతులను అర్హులుగా గుర్తించగా 150.18 లక్షల ఎకరాలకు రైతుబంధు అందనుంది. ఇందుకోసం రూ.7,508.78 కోట్లు అవసరంకాగా, నిధులను ప్రభుత్వం ఇప్పటికే బ్యాంకులకు అందజేసింది. వరుసగా ఏడోసారి రైతుబంధు కింద అన్నదాతకు పంటసాయం అందిస్తోండగా కరోనా విపత్తులో ఇది మూడోసారి.
- Advertisement -