శరద్‌ పవార్‌ ఆధ్వర్యంలో ప్రతిపక్షాల కీలక సమావేశం

38
sharad pawar

ఢిల్లీ ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఆధ్వర్యంలో ప్రతిపక్షాల కీలక సమావేశం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ, బిజెపి కి వ్యతిరేకంగా విపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడమే లక్ష్యంగా భేటి ఏర్పాటు చేశారు. తాజాగా రెండు సార్లు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌తో భేటీ అయ్యారు ఎన్సీపీ అగ్రనేత శరద్‌ పవార్‌.

2024 ఎన్నికలే లక్ష్యంగానే మంతనాలు ఉంటాయని ఊహాగానాలు జరుగుతుండగా సమావేశానికి రావాలని 15 పార్టీల నేతలు, మేధావులు, కళాకారులకు ఆహ్వానం పంపారు. ఆప్, టీఎంసీ, ఆర్జెడీ, సీపీఐ నేత డి రాజా, జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా, యశ్వంత్ సిన్హా, పవన్ వర్మ, మాజీ ఎన్నికల కమిషనర్ ఖురేషీ, జర్నలిస్టు కరణ్ తాపర్ తో పాటు మరికొంత మంది ప్రముఖులు హాజరు అయ్యే అవకాశం ఉంది.