మూడో రోజుకు రైతుబంధు పంపిణీ..

127
bandhu
- Advertisement -

వానాకాలం సాగుకు రైతులకు ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు సాయం పంపిణీ 3వ రోజుకు చేరింది. ఇవాళ 3 ఎకరాల్లోపు భూమి ఉన్న 10,40,017 మంది రైతుల ఖాతాల్లో రూ.1275.85 కోట్ల నగదును సర్కార్‌ జమ చేయనుంది.

ఇప్పటివరకు 42,42,178 మంది రైతుల ఖాతాల్లో రూ. 2,942.27 కోట్లు జమ చేసినట్లు వ్యవసాయశాఖ వెల్లడించింది. రైతులు పంట సాగు చేసుకునేందుకు పెట్టుబడికి ఇబ్బంది లేకుండా ఎకరానికి ఏడాదికి రూ. 10 వేలు అందిస్తున్న విషయం తెలిసిందే. మధ్యవర్తులు లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లోనే రైతుబంధు నగదు ఖాతాల్లో జమ కావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -