దేశంలో 24 గంటల్లో 67,208 కరోనా కేసులు..

85
corona

దేశంలో కరోనా సెకండ్ వేవ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంట‌ల్లో కొత్త‌గా 67,208 పాజిటివ్ కేసులు న‌మోదుకాగా 2330 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,97,00,313కి చేరగా 2,84,91,670 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకున్నారు.

ఇప్పటివరకు కరోనాతో 3,81,903 మంది మ‌ర‌ణించగా దేశంలో 8,26,740 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్ప‌టివ‌ర‌కు 26,55,19,251 మందికి వ్యాక్సిన్ పంపిణీ చేయగా జూన్ 16 నాటికి క‌రోనా ప‌రీక్షల సంఖ్య 38,52,38,220కు చేరింద‌ని వైద్య,ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది.