Rythu Bandhu:కోతలు మొదలు.. రైతుబంధు కట్?

190
- Advertisement -

తెలంగాణలో రైతులకు షాక్ ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్దమౌతోందా ? గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన రైతు బంధులో మార్పులు చేయనుందా ? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నాయి. రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.10 వేల రూపాయలు ఇస్తూ వచ్చింది గత ప్రభుత్వం. అయితే తాము అధికారంలోకి వస్తే రైతు భరోసా కింద రైతులకు, కౌలు రైతులకు రూ.15 వేలు ఇస్తామని కాంగ్రెస్ నేతలు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. అంతే కాకుండా ఏటా వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు, అలాగే వరి పంటకు అదనంగా రూ.500 బోనస్ ఇస్తామని కూడా ప్రకటించింది కాంగ్రెస్. కానీ అధికారంలోకి వచ్చిన వాటిని ఎంతవరకు అమలు చేస్తుందనే డౌట్ చాలామందిలో వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో రైతుబంధు విషయంలో మార్పులు చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్దమౌతోందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. .

అధికారులు, ఉద్యోగులు, ప్రముఖులు, భూస్వాములు, వ్యాపార వేత్తలు.. వంటివారికి రైతుబంధును కట్ చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోందట. ఎందుకంటే గతంలో పెట్టుబడి సాయం కింద రైతులకు ఎకరానికి రూ.10 వేలు సాయం అందేది. కానీ ఇప్పుడు రూ. 15 వేలు ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించడంతో అదనపు బడ్జెట్ కేటాయించాల్సిన పరిస్థితి. దాంతో ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు రైతుబంధులో కోతలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అమలవుతున్న ఉచిత బస్సు ప్రయాణంలో కూడా ఎన్నికల ముందు అన్నీ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అని ప్రకటించిన కాంగ్రెస్.. హామీ అమలులో మాత్రం షరతులు విధించింది. కేవలం పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సులకు మాత్రమే ప్రయాణాన్ని పరిమితం చేసింది. ఇలా మొదట్లోనే హామీల అమలులో కోతలు విధిస్తున్న కాంగ్రెస్ సర్కార్.. ముందు రోజుల్లో హామీలైన అమలు చేస్తుందా లేదా అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు రాజకీయవాదులు.

Also Read:చలికాలంలో చేపలు తినడం మంచిదేనా?

- Advertisement -