- Advertisement -
ఇటీవల కాలంలో తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కి .. ఎక్కువ లాభాలను సాధించిన సినిమాల్లో ‘ఆర్ ఎక్స్ 100’ ఒకటి. ఈ మూవీ సంచలన విజయంతో ప్రేక్షకులను.. ఇండస్ట్రీని ఆకర్షించిన దర్శకుడు అజయ్ భూపతి. ఈ దర్శకుడి సెకండ్ సినిమా దాదాపుగా ఫైనలైజ్ అయినట్టే. అజయ్ నెక్స్ట్ సినిమా ఒక మల్టిస్టారర్ అని అందులో రామ్ – దుల్కర్ సల్మాన్ హీరోలుగా నటిస్తారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
కానీ తాజా సమాచారం మేరకు ఆ మల్టిస్టారర్‌ను పక్కన బెట్టి నితిన్‌తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట దర్శకుడు అజయ్ భూపతి. నితిన్ హీరోగా కథను లాక్ చేసుకుని, త్వరలో సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నాడని అంటున్నారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మితం కానున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కథానాయికల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందని అంటున్నారు.
- Advertisement -