టీఆర్ఎస్‌దే గెలుపు..విపక్షాలకు అస్త్ర సన్యాసమే

240
ktr
- Advertisement -

తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు అడుగడుగునా అడ్డుపడుతున్న టీడీపీ-కాంగ్రెస్‌ కూటమితో కోదండరాం ఎలా జతకడతారని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్. ముష్టి మూడు సీట్ల కోసం గాంధీభవన్‌ చుట్టు కోదండరాం చక్కర్లు కొడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో కరీంనగర్ జిల్లాకు చెందిన బీజేపీ నేత విజేందర్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరిన సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తర కుమార ప్రగల్బాలు పలుకుతున్నారని చెప్పారు.ఆయన చెప్పిన హామీలన్ని నెరవేర్చాలంటే ఐదు రాష్ట్రాల బడ్జెట్ కావాలన్నారు. కాంగ్రెస్ హఠావో దేశ్ బచావో అని 1983లో ఎన్టీఆర్ పిలుపునిచ్చారని కానీ ఇవాళ అదే టీడీపీతో కాంగ్రెస్ పొత్తు పెంటుకుంటుదన్నారు.

మహాకూటమి కాదు తెలంగాణ ద్రోహ కూటమి అన్నారు. ఏ ప్రాతిపదికన పొత్తులు పెట్టుకుంటున్నారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ విలువలకు తిలోదకాలకు ఇచ్చిందన్నారు. ఏ అమరుల కుటుంబం చెప్పిందని కోదండరాం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటున్నారని ప్రశ్నించారు.

స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని జయశంకర్ సార్ చెప్పేవారని గుర్తుచేశారు. మహాకూటమి అధికారంలోకి వస్తే రైతన్నల నోట్లో మట్టికొడతారని చెప్పారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్,టీడీపీ,బీజేపీ ఏక్‌,దో,తిన్‌ అంటూ లెక్కలు పెట్టుకుంటున్నాయని ఎద్దేవా చేశారు.

ప్రజల సంక్షేమం కోసం రాజీలేని పోరాటం చేసిన వ్యక్తి కేసీఆర్‌ అని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలకు సలాం కొట్టి..ప్రజల కోసమే పనిచేసే వ్యక్తి కేసీఆర్ అన్నారు. 67 ఏళ్లు కరెంట్ ఇవ్వకుండా కాల్చుకుని తిన్న రాబంధులు కావాల…రైతు బంధు ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలో ఆలోచించుకోవాలన్నారు. మిషన్ భగీరథతో ఇంటింటికీ మంచినీరు తీసుకొచ్చి ఫ్లోరైడ్ సమస్యకు పరిష్కారం చూపించామన్నారు. రానున్న ఎన్నికల్లో  టీఆర్ఎస్‌దే గెలుపని..విపక్షాలకు అస్త్ర సన్యాసమే అన్నారు.

కాంగ్రెస్ దేశానికి పట్టిన శని, దరిద్రం అన్నారు. కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పదవి కోసం కుర్చిలాట జరుగుతోందన్నారు. తెలంగాణలో సీల్డ్ కవర్ సీఎం కావాలా….సింహం లాంటి కేసీఆర్ సీఎం కావాలా ఆలోచించుకోవాలన్నారు. అమరావతికి గులాం కాకుండా ఎట్టికైనా,మట్టికైనా మనడో తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతారన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగరేద్దామని చెప్పారు.

- Advertisement -