కరోనా వ్యాక్సిన్‌..మరో శుభవార్త తెలిపిన రష్యా

192
russia

ప్రపంచంలో తొలి కరోనా వ్యాక్సిన్‌ను కనిపెట్టిన దేశంగా రష్యా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వ్యాక్సిన్‌కు సంబంధించి మరో గుడ్ న్యూస్ తెలిపింది. తాము కనిపెట్టిన వ్యాక్సిన్‌ మనుషులపై ఎలాంటి దుష్ప్రబావం చూపలేదని వెల్లడించింది.

కరోనా తొలి వ్యాక్సిన్‌ను రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఇచ్చిన సంగతి తెలిసిందే. తొలుత వైద్యులు, ప్రభుత్వ ఉపాధ్యాయులకు కరోనా వ్యాక్సిన్ ఇవ్వగా జనవరి నుండి రష్యా ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు.

మాస్కోకు చెందిన గమలేయ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్‌కు మానవ పరీక్షలు చేసిన రెండు నెలల కన్నా తక్కువ సమయంలోనే అనుమతి లభించడం విశేషం.