టాలీవుడ్‌లో మరో క్రేజీ మల్టీస్టారర్‌!

204
sharwanand

టాలీవుడ్‌లో ప్రస్తుతం మల్టీస్టారర్‌ ట్రెండ్ నడుస్తోంది. తాజాగా మరో క్రేజీ మల్టీస్టారర్‌ వెండితెరపై వచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఆర్‌ఎక్స్ 100 ఫేమ్ కార్తీకేయ-యంగ్ హీరో శర్వానంద్‌ కాంబినేషన్‌లో మల్టీస్టారర్ మూవీ రానుంది.

ఆర్ ఎక్స్100 సినిమాతో సంచలనం సృష్టించిన దర్శకుడు అజయ్ భూపతి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాకు మహాసముద్రం అనే టైటిల్ ఖరారు చేశారు.

తొలుత ఈ మూవీని రవితేజ-నాగ చైతన్యతో తెరకెక్కించేందుకు అజయ్ భూపతి ప్లాన్ చేసిన వారు రిజెక్ట్ చేయడంతో కార్తీకేయ-శర్వానంద్‌లతో తెరకెక్కిస్తున్నారు. హీరోయిన్స్ గా సాయిపల్లవి, మజిలీ ఫేమ్ దివ్యాంశ కౌశిక్ ను తీసుకున్నారని త్వరలోనే ఇందుకు సంబంధించి అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది.