కరోనాను జయించిన ఎస్పీ బాలు..

276
sp balu

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనాను జయించారు. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ఆయనకు కరోనా నెగటివ్ వచ్చినట్లు బాలు కుమారుడు చరణ్ వెల్లడించారు. నాన్న కోలుకోవాలని ప్రార్ధనలు నిర్వహించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

కరోనా పాజిటివ్‌తో చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో బాలసుబ్రమణ్యం చేరిన సంగతి తెలిసిందే. అప్పటినుండి ఆయన ఆరోగ్య పరిస్ధితిపై ఎప్పటికప్పుడు హెల్త్ బులిటెన్ రిలీజ్ చేస్తూనే ఉన్నాయి ఆస్పత్రివర్గాలు. ఆయన కుమారుడు సైతం బాలు ఆరోగ్య పరిస్ధితిపై సోషల్ మీడియా ద్వారా అప్ డేట్ ఇస్తూనే ఉన్నారు.

బాలు ఆరోగ్య పరిస్ధితిపై సినీ రంగానికి చెందిన ప్రముఖులు ఆరా తీస్తూనే ఉన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.