- Advertisement -
డెల్టా వేరియంట్‌తో రష్యా రాజధాని మాస్కో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత రెండు వారాల్లో రోజుకు మూడు వేల చొప్పున కేసులు నమోదుకాగా తాజాగా ఒకే రోజులో 9 వేలకు పైగా పాజిటివ్ కేసులు రిజిస్టరయ్యాయి. ఒక్కసారిగా కేసులు మూడింతలవడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.
కొత్తగా నమోదవుతున్న కేసుల్లో 90 శాతం డెల్టా వేరియంట్‌కు సంబంధించినవే ఉంటున్నాయని మాస్కో నగర మేయర్ సెర్గీ సోబ్యానిన్ అన్నారు.ఇక రష్యాలో గత 24 గంటల్లో 17,906 కేసులు, 466 మరణాలు నమోదయ్యాయి. అందులో మాస్కోలోనే 9 వేలకుపైగా కేసులు ఉండగా, 76 మంది మరణించారు. మార్చి 13 తర్వాత దేశంలో ఇంత పెద్దసంఖ్యలో కేసులు, మరణాలు సంభవించడం ఇదే మొదటిసారి.
- Advertisement -