బీబీసీ డాక్యుమెంటరీపై రష్యా స్పందన..

30
- Advertisement -

బీబీసీ సంస్థ విడుదల చేసిన డాక్యుమెంటరీని రష్యా తప్పు పట్టింది. బీబీసీ ఇటివలే భారత ప్రధాని మోదీపై రూపొందించిన డాక్యుమెంటరీ వివాదాస్పదం అయిన నేపథ్యంలో రష్యా స్పందించింది. అన్ని రంగాల్లో బీబీసీ సమాచార యుద్ధానికి దిగుతున్నట్టు రష్యా విదేశాంగ శాఖ ప్రతినిధి మారియా జకరోవా అన్నారు.

బీబీసీ కేవలం రష్యాపై మాత్రమే కాకుండా ఇతర దేశాలపై సమాచార యుద్ధానికి పాల్పడుతున్నట్టు జకరోవా తెలిపారు. ఫ్రిన్సెస్ డయానా మరణం తర్వాత మళ్లీ సొంత దేశంలోనే బీబీసీ విమర్శలు ఎదుర్కొంటుందని ఆరోపించారు. ఇది కేవలం కొన్ని గ్రూపుల ప్రయోజనాల కోసం ఆ సంస్థ పనిచేస్తోందని ఆ సంస్థను ఆ విధంగానే ట్రీట్‌ చేయాలని జకరోవా తెలిపారు.

గుజరాత్ సీఎంగా మోదీ ఉన్న సమయంలో 2002లో అల్లర్లు చోటుచేసుకున్నాయి. దాంట్లో మోదీ పాత్ర ఉన్నట్టు ఆ డాక్యుమెంటరీలో ఆరోపించింది. అయితే భారత అత్యున్నత సుప్రీం కోర్టు ఈ కేసులకు సంబంధించిన ఆంశాలపై విచారణ కొనసాగించి…మోదీతో పాటు పలువురికి క్లీన్‌ చీట్‌ ఇచ్చింది. ప్రస్తుతం కేంద్రం ప్రభుత్వం ఈ డాక్యుమెంటరీని బ్యాన్‌ చేసింది. దీనికి సంబంధించిన ట్విట్టర్ యూట్యూబ్‌లో లింక్‌లను కూడా బ్లాక్ చేశారు.

ఇవి కూడా చదవండి…

ఇండియా ఫస్ట్…సిటిజన్ ఫస్ట్

ఏపీ రాజధాని విశాఖనే.. క్లియర్!

కేజ్రీవాల్‌ని చంపేస్తాం..బెదిరింపు కాల్స్!

- Advertisement -