ద్రావిడ్ సాయం కావాల్సిందే: వెంగ్ సర్కార్‌

100
dravid

ఆడిలైడ్ టెస్టులో భారత జట్టు ఘోర ఓటమిని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. టెస్టు క్రికెట్ చరిత్రలో భారత్ జట్టు అత్యల్ప స్కోరు ఇదే కాగా కోహ్లీ సేన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.

మిగిలిన మూడు టెస్టుల్లోనైనా కంగారూలకి గట్టి పోటీనివ్వాలంటే రాహుల్ ద్రవిడ్‌ని అక్కడికి పంపాలని వెంగ్‌సర్కార్ సూచించాడు. బంతి స్వింగ్ అవుతున్నప్పుడు ఎలా బ్యాటింగ్ చేయాలి..? అని చెప్పడానికి నాకు తెలిసి రాహుల్ ద్రవిడ్‌కి మించిన వాళ్లు ప్రస్తుతం ఎవరూ లేరన్నారు.

సిరీస్ టైమ్‌లో అతను నెట్స్‌లో ఉంటే.. భారత క్రికెటర్లలోనూ అతను తన మాటలతో వారిలో స్ఫూర్తి నింపగలడు. కాబట్టి.. బ్యాట్స్‌మెన్‌లకి సాయం చేసేందుకు బీసీసీఐ అతడ్ని వెంటనే ఆస్ట్రేలియాకి పంపితే మేలని పేర్కొన్నారు.