బీజేపీలో చేరిన రూపాలీ గంగూలీ..

18
- Advertisement -

ప్రముఖ నటి రూపాలీ గంగూలీ బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ నాయకుల సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ హయాంలో ఒక యజ్ఞంలా జరుగుతున్న అభివృద్ధి పనుల చూసి తాను ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ఆ యజ్ఞంలో తాను కూడా ఒక భాగం కాదలుచుకున్నానని అన్నారు.

అనుపమ సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రూపాలీ గంగూలీ. దేశంలో మహాయజ్ఞంలా జరుగుతున్న అభివృద్ధిని చూసి నేను కూడా ఈ యజ్ఞంలో భాగం కావాలని అనుకున్నా. అందుకే బీజేపీలో చేరా. నా మీ అందరి దీవెనలు, మద్దతు ఎప్పటికీ కావాలన్నారు.

Also Read:May Day:ఆటో నడిపిన హరీష్

- Advertisement -