హీరోయిన్లలో చాలామంది అపార్ట్మెంట్ల మీద, ల్యాండ్స్ మీదే ఎక్కువుగా పెట్టుబడి పెడుతూ ఉంటారు. ఈ విషయంలో రష్మికా మందాన్న స్పెషల్. ఆమె ఎక్కడికి వెళ్తే.. అక్కడ ఓ ఇల్లు కొంటుంది. ఇప్పటికే రష్మికా మందాన్న బెంగళూరులో రెండు అపార్ట్మెంట్లు కొంది. హిందీ సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి అనగానే.. వెళ్ళి ముంబైలో ఓ విల్లా కొనుక్కుంది. ఇక హైదరాబాద్ లోని మణికొండ ఏరియాలో రష్మికా మందాన్నకి ఆల్ రెడీ ఓ పెద్ద విల్లా ఉంది. అయితే, రీసెంట్ గా చెన్నైలో కూడా రష్మికా మందాన్న ఓ విల్లా కొనుగోలు చేసింది అనే వార్త ఇప్పుడు కోలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Also Read:IPL 2023:ఢిల్లీపై చెన్నై ఘన విజయం
రష్మికా మందాన్న 5 కోట్లు పెట్టి ఈ విల్లా కొంది అంటూ ప్రచారం చేస్తున్నారు. ఐతే, ఇందులో కొంతే నిజముంది. ఐతే, ఆమె కొన్నది విల్లా కాదు. రష్మికా మందాన్న ఓ హౌస్. అంటే.. ఆమె ఇన్వెస్ట్ మెంట్ లో భాగంగా కొన్నది. అది కూడా 4 కోట్ల రూపాయలకు. కానీ మీడియాలో మాత్రం అతిగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం రష్మిక హైదరాబాద్ టు ముంబై తిరుగుతూ ఉంది. మరి చెన్నైలో ఎందుకు ఉన్నట్టు ఉంది హౌస్ కొంది ? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Also Read:ఎగ్జిట్ పోల్స్ : సంచలనం.. విజయం ఆ పార్టీదే !
రష్మికా మందాన్నకి ఇటీవల బ్రాండ్స్, సినిమాల ద్వారా పెద్ద మొత్తం చేతికి వచ్చింది. ఆ డబ్బుని రష్మికా తెలివిగా ఇలా ఇన్వెస్ట్ చేసింది. రష్మికా మందాన్న ఆస్తులపై బాలీవుడ్ మీడియా కన్నేసింది. ఉన్నది, లేనిది రాకుంటూ పోతుంది. దాన్ని యాజిటీజ్ గా ఇక్కడ కాపీ కొట్టేస్తున్నారు. దాంతో రష్మికా మందాన్న ఆస్తుల పై రోజుకొక పుకారు వినిపిస్తూనే ఉంది. అయినా, ఒక్క రష్మికానే కాదు, పూజా హెగ్డే, సమంత, తమన్నా ఇలా చాలామంది తమ కెరీర్ ప్రారంభం నుంచి ప్రాపర్టీలపై ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్నారు. ఎంతైనా ఇప్పటి హీరోయిన్లు తెలివి మీరిపోయారు.