కీర్తి సురేష్‌ పెళ్లి పై మళ్లీ పుకార్లు

32
- Advertisement -

టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్‌ ప్రేమ,పెళ్లి అంటూ వార్తల్లో నిలుస్తుంది. ఓ వ్యాపార వేత్తతో త్వరలో కీర్తీ సురేష్‌ పెళ్లి కాబోతుందని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి వార్తలపై కీర్తీ సురేష్‌ ఎప్పుడూ స్పందించ లేదు. దీనిపై ఆమె తల్లి నటి మేనక స్పందించారు. కీర్తీ పెళ్లిపై వస్తున్న వార్తలు అవాస్తవం అన్నారు. కీర్తీ ఎవరిని ప్రేమించినా తమకు చెబుతుందని, దాన్ని తాము మీడియా ద్వారా వెల్లడిస్తామని చెప్పారు.

ఇక కీర్తిసురేశ్‌ – నాని జంటగా నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘దసరా’. ఈ చిత్రాన్ని శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలోని పాట ‘చమ్కీల అంగిలేసి’ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్‌ చేస్తోంది. ఈ పాటలో కీర్తిసురేశ్‌ అద్భుతంగా డ్యాన్స్ చేసింది. ఈ పాటకు డ్యాన్స్ చేస్తూ కీర్తిసురేశ్‌ మరింత అందంగా కనిపిస్తుంది. అందుకే, ఈ పాటకు యువత కవర్‌ సాంగ్స్‌ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.

ఇక దసరా సినిమా ఏవరేజ్ టాక్ తెచ్చుకుంది. కానీ సినిమాలో నాని – కీర్తిసురేశ్‌ల నటన చాలా బాగుంది అని ప్రేక్షకులు చెబుతున్నారు. ముఖ్యంగా కీర్తి సురేశ్‌ చాలా బాగా నటించిందట. ఇలాంటి సమయంలో కీర్తిసురేశ్‌ పెళ్లి పై మళ్లీ రూమర్లు వైరల్ అవ్వడం విశేషం.

ఇవి కూడా చదవండి..

- Advertisement -