Rules Ranjan:సెన్సార్ పూర్తి

53
- Advertisement -

కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా రత్నం కృష్ణ దర్శకత్వం వహిస్తున్న చిత్రం రూల్స్ రంజన్. అక్టోబర్ 6న ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సుప్రసిద్ధ నిర్మాత ఏ.ఎం. రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి నిర్మిస్తున్నారు.

ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం వస్తున్నట్లు ట్రైలర్ చూస్తేనే అర్ధం అయ్యిపోయింది. ఇక తాజాగా సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్‌ను పూర్తి చేసుకుంది. యూ/ఏ సర్టిఫికెట్ ని పొందగా 158 నిమిషాల రన్ టైంని లాక్ చేసినట్లు తెలుస్తోంది. అంటే 2 గంటల 38 నిమిషాల నిడివి అన్నమాట. ఈ మధ్యకాలంలో ఇంత ఫుల్ లెంగ్త్ మూవీ రాలేదు.

ఈ ఫుల్ లెంగ్త్ మూవీలో రూల్స్ రంజన్ ఎంటర్టైన్ చేస్తాడో లేదో తెలియాలి.

Also Read:KCR:కేసీఆర్ ఫైటర్‌..బీజేపీ చీటర్

- Advertisement -