ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ విజయవంతంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా రుద్ర వీణ మూవీ టీం మొక్కలు నాటారు. రుద్ర వీణ మూవీ టీం మధు సుధన్, లక్ష్మణ్,రఘకుంచే,శ్రీ రామ్, ఎల్సా తదితరులు ప్రశషన్ నగర్ లో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా రఘకుంచే నటి నటులు శ్రీ రామ్, ఎల్సా మాట్లాడుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ లాంటి గొప్ప కార్యక్రమం లో పాల్గొని మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. శుక్రవారం రుద్ర వీణ సినిమా సందర్బంగా మొక్కలు నాటడమే కాదు సందర్బం వచ్చినప్పుడల్లా మరిన్ని మొక్కలు నాటి సంరక్షిస్థానని అన్నారు.
మంచి ఆక్సీజన్ కావాలన్నా, అందరం ఆరోగ్యంగా ఉండాలన్నా మొక్కలు నాటాల్సిన బాధ్యత అందరి మీద ఉంది అన్నారు. ఇంతటి గొప్ప అవకాశం కల్పించిన రాజ్య సభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో భాగంగా మధుర శ్రీధర్ రెడ్డి, లక్ష్మి బోపాల్,కళామందిర్ కళ్యాణ్ వీరి ముగ్గురిని రఘు కుంచె మొక్కలు నాటాలని కోరగా,డా సందీప్ చౌదరి,హోరో అభిరామ్, డైరెక్టర్ లక్ష్మి నారాయణ వీరి ముగ్గురిని మొక్కలు నాటాలని ఎల్సా కోరారు.
ఇవి కూడా చదవండి