మంత్రి పొన్నం ప్రభాకర్‌తో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు భేటీ అయ్యారు. సొమవారం మినిస్టర్ క్వార్టర్స్ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను పలువురు ఆర్టీసీ సంఘాల నేతలు కలిశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ సంఘాల నేతలు ఆర్టీసీ కార్మికుల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.
సమ్మె చేయవద్దని ఆర్టీసీ కార్మికులకు పొన్నం విజ్ఞప్తి చేశారు. టీజీఎస్ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది.. సమస్యలు తొలుగుతున్నాయని అన్నారు. ఆర్టీసీకి 16 నెలలుగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాం.. ఒక్కటైన ఇబ్బంది పెట్టామా? అని ప్రశ్నించారు. ఆర్టీసీ సమస్యలు వినడానికి తాను కానీ ముఖ్యమంత్రి కార్యాలయం తలుపులు సైతం ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు.
ఆర్టీసీ ఉద్యోగులకు 2013 నుంచి చెల్లించాల్సిన బాండ్ మొత్తం రూ.400 కోట్లు చెల్లించిందన్నారు. 2017 పే స్కేల్ 21% శాతం ఇవ్వడంతో సంవత్సరానికి రూ. 412 కోట్ల భారం పడుతుందని తెలిపారు. పీఎఫ్ ఆర్గనైజేషన్ సుదీర్ఘ కాలంగ పెండింగ్‌లో ఉన్న రూ.1039 కోట్లు చెల్లించామన్నారు. దాదాపు 1500 మంది కారుణ్య నియామకాలు చేపట్టినట్లు తెలిపారు.
Also Read:28 మండలాల్లో భూ భారతి అమలు..

