Trump: డోనాల్డ్ ట్రంప్‌ సంచలనం..ఈసారి!

15
- Advertisement -

వరుస సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్నాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌. ఇప్పటివరకు ఉద్యోగుల తొలగింపు, సుంకాల మోతతో అన్ని దేశాలను కుదిపేసిన ట్రంప్… ఈసారి సినిమా పరిశ్రమపై పడ్డారు.

ఇకపై అమెరికాలో విడుదల చేసే విదేశీ సినిమాలపై 100 శాతం టారిఫ్‌లు విధించనున్నట్లు సంచలన ప్రకటన చేశారు. అమెరికన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అమెరికా బయట షూటింగ్ చేసి తమ దేశంలో రిలీజ్ చేసే అన్ని రకాల సినిమాలపై వంద శాతం పన్ను విధిస్తున్నట్లు ప్రకటించారు.

విదేశీ సినిమాల వల్ల హాలీవుడ్ నష్టపోతోందని…ఇతర దేశాలు ఒక్కటైన హాలీవుడ్‌ను నాశనం చేసేందుకు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. అందుకే విదేశాల్లో నిర్మించి అమెరికాలో విడుదల చేసే సినిమాలపై వంద శాతం సుంకం విధించనున్నట్లు తెలిపారు.

Also Read:Directors Day:దాసరి బర్త్ డే

- Advertisement -