28 మండలాల్లో భూ భారతి అమలు..

36
- Advertisement -

నేటి నుంచి తెలంగాణ వ్యాప్తంగా 28 మండలాల్లో భూ భారతి అమలుకానుంది. ప్రతి జిల్లాకు ఒక మండలం చొప్పున రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారు అధికారులు. భూ భారతి చట్టంపై ప్రజల్లో అవగాహన – భూ సమస్యలపై దరఖాస్తుల స్వీకరణ చేపట్టనున్నారు. మే 5 నుంచి 20వ తేదీ వరకు కొనసాగనుంది ఈ కార్యక్రమం. ప్రతి కలెక్టర్ సదస్సుల్లో పాల్గొని ప్రత్యక్షంగా రైతుల సందేహాల నివృత్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

గ‌త నెల 17వ తేదీ నుంచి 30వ తేదీ వ‌ర‌కు నాలుగు జిల్లాల్లోని నాలుగు మండ‌లాల్లో నిర్వ‌హించిన మాదిరిగానే ఇవాళ్టి నుండి జిల్లాకొక మండ‌లం చొప్పున 28 జిల్లాల్లోని 28 మండ‌లాల్లో రెవెన్యూ స‌ద‌స్సుల‌ను నిర్వ‌హించనున్నారు.

ప్ర‌జాకోణంలో తీసుకువ‌చ్చిన ఈ భూభార‌తి చ‌ట్టంపై ప్ర‌జ‌ల్లో విస్తృత స్ధాయిలో అవ‌గాహ‌న క‌ల్పించ‌డంతోపాటు. ఆయా మండ‌లాల్లో భూ స‌మ‌స్య‌ల‌పై ప్ర‌జ‌ల నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను స్వీకరించి వాటిని ప‌రిష్క‌రించ‌డ‌మే ఈ రెవెన్యూ స‌ద‌స్సుల ముఖ్య ఉద్దేశ‌మ‌ని అధికారులు తెలిపారు.

Also Read:50 ఏళ్లుగా హీరోని..ఎవరూ లేరు!

- Advertisement -