హెల్త్‌ చాలెంజ్..వందల మందికి రక్షణ

194
- Advertisement -

తెలంగాణ ఆర్టీసీ సంస్థలో ఏటా మరణాల సంఖ్య నమోదవుతుండటాన్ని గుర్తించిన సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ వాటిని నివారించడానికి సిద్ధమయ్యారు. ఈ తరుణంలో హెల్త్‌ ఛాలెంజ్ పేరుతో ఆర్టీసీ ఉద్యోగులకు 17రకాల వైద్య పరీక్షలు నిర్వహించగా అందులో 287మంది తీవ్రమైన హృద్రోగ సమస్యలను ఎదుర్కొంటున్నట్టు తేలింది.

రోజువారీ విధులకు హాజరవుతున్న48వేల మంది సిబ్బందికి టెస్టులు చేయించగా వారిలో తీవ్ర ఆనారోగ్యసమస్యలు ఉన్నావారిని గుర్తించింది. దీంతో వారి బాగోగులను హెల్త్‌ ఛాలెంజ్ ద్వారా ప్రభుత్వం తీసుకుంది. అయితే వారిలో గుండె పనితీరు బాగోలేదని వారి పరిస్థితి క్రిటికల్‌గా ఉన్నట్టు గుర్తించారు.

ప్రతియేటా ఆర్టీసీ సిబ్బంది వివిధ ఆనారోగ్య కారణాలతో మరణిస్తూనే ఉన్నారు. దీంతో క్రిటికల్ ఈ సీజీ జాబితాలో 287మంది ఉద్యోగులు ఉన్నారు. వారిలో సమస్య తీవ్రత ఉన్నవారిని గుర్తించి అందులో 60మందికి యాంజియోగ్రామ్ పరీక్షలు నిర్వహించారు. ఇందులో అతితీవ్రంగా ఉన్న 25మందికి వెంటనే స్టెంట్లు వేయించారు. మరో 10మంది మరింత క్రిటికల్‌గా ఉన్నట్టు తేల్చి అందులో ఇద్దరికి నిమ్స్‌లో ఓపెన్‌హార్ట్‌ సర్జరీ చేయించారు. మరో ఇద్దరికి సర్జరీ చేసేందుకు నిమ్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. మిగిలిన సిబ్బందికి చికిత్సలు అందిస్తున్నారు.

నిర్లక్ష్యం ఖరీదు..ఇద్దరు మృతి
సకాలంలో ప్రభుత్వం వైద్య సేవలు అందించిన వారు సకాలంలో మందులు వేసుకోకపోవడం వల్ల ఇద్దరు మరణించినట్టుగా ఎండీ సజ్జనార్ తెలిపారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఎండీ సజ్జనార్‌ మిగతావారు మందులు సరిగా వేసుకునేలా చూడాల్సిన బాధ్యతను డిపో మేనేజర్లకు అప్పగించారు. ఇందుకోసం యాప్ ద్వారా అలర్ట్‌ మెసేజ్ లు డీఎంలకు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సిబ్బందికి నిమ్స్‌ తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రులను ఉపయోగించనున్నట్టు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ప్రకటించారు. సిబ్బంది ఆరోగ్యమే సంస్థ ఆరోగ్యమన్నారు.

ఇవి కూడా చదవండి…

డ్రగ్స్ టెస్టుకు నేనే ఓకే.. బండి దమ్ముంటే చర్చకు రా..

సెస్ పేరుతో ఎడాపెడా

పవన్ తో ముప్పు.. ఎవరికి ?

- Advertisement -