ఆరెస్సెస్ ఈవెంట్‌కు రాహుల్‌..

238
- Advertisement -

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్.. దీన్నే సింపుల్‌గా ”ఆరెస్సెస్” అని కూడా అంటారు. వచ్చే నెల 17 నుంచి 19 వరకు ఓ కార్యక్రమాన్ని నిర్వహించనుంది ఆరెస్సెస్. అయితే ఆ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ని ఆరెస్సెస్ ఆహ్వానించనుందని వార్తలొస్తున్నాయి. ఆర్‌ఎస్సెస్‌ పేరు వింటేనే అంతెత్తున లేస్తారు రాహుల్‌.

దేశాన్ని మతపరంగా విభజిస్తున్నదంటూ ఆరెస్సెస్‌పై ఆయన విమర్శలు గుప్పిస్తారు. అలాంటిది ఢిల్లీలో నిర్వహించబోమే ఆర్‌ ఎస్‌ఎస్‌ ఈవెంట్ కి రాహుల్‌తోపాటు సీతారాం యేచూరిలాంటి ఇతర ప్రతిపక్ష నేతలను కూడా పిలవాలని ఆరెస్సెస్ భావిస్తుంది.

RSS To Invite Rahul Gandhi ఇటీవలే ఈ ఏడాది జూన్‌లో నాగ్‌పూర్‌లో జరిగిన కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఆరెస్సెస్ ఆహ్వానించిన విషయం తెలిసిందే. దీనిపై అప్పట్లోనే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కాంగ్రెస్ వాది అయిన ప్రణబ్.. ఆ పార్టీ బద్ధశత్రువు ఆరెస్సెస్ సమావేశానికి వెళ్లడంపై విమర్శలు కూడా వచ్చాయి. ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకే ఆహ్వానం పంపాలని ఆరెస్సెస్ భావిస్తుండటం చర్చనీయాంశమైంది. ఒకవేల రాహుల్‌ని ఆర్ఎస్‌ ఎస్‌ ఆహ్వానిస్తే..రాహుల్‌ వెళ్తారా లేదా అనే అనుమానాలు మొదలయ్యాయి.

- Advertisement -