తెలంగాణలో ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ నేత, ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్. ఎక్స్‌లో ట్వీట్ చేసిన ఆర్‌ఎస్పీ…కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులమీదుగా ఆర్భాటంగా 614 మందికి ఎక్సైజ్ కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందజేసిందని కానీ 40 రోజులైనా వారిని ట్రెయినింగ్‌కు పిలువకపోవడంతో దారుణమన్నారు.
నియామక పత్రం అందుకుని ట్రెయినింగ్ కోసం ఎదురుచూస్తున్న ఓ ఎక్సైజ్ కానిస్టేబుల్ రాసిన లేఖను పోస్టు చేసిన ప్రవీణ్ కుమార్..రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తన చేతిలో ఏమీ లేదని చెప్పినట్టుగా బాధితులు ఆవేదన చెందుతున్నారని అన్నారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉన్నదా అని ప్రశ్నించారు.
Also Read:రహస్యంగా పెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్థ్-అదితి
ఎంతో ఆర్భాటంగా ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి @revanth_anumula గారి చేతుల మీదుగా నియామకపత్రాలు తీసుకున్న 614 మంది ఎక్సైజు కానిస్టేబుళ్లు ట్రైనింగ్ కు పోకుండా గత నలభై రోజుల నుండి త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారు.
ఎక్సైజు శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు గారు నా చేతిలో ఏంలేదు… pic.twitter.com/TgybCNybPw— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) March 27, 2024