KTR:రేవంత్‌కు దమ్ముంటే మల్కాజ్‌గిరిలో పోటీచేయాలి

17
- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే మల్కాజ్‌గిరిలో పోటీచేయాలన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్ లో జరిగిన మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో పాల్గోన్న కెటిఅర్…రేవంత్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, పోటీకి వస్తే మా అభ్యర్థిని బతిమిలాడుకొని నేను పోటీలో నిలబడతా అన్నారు.అంత పెద్ద ముఖ్యమంత్రి పదవిలో ఉన్నా తర్వాత కూడా రేవంత్ రెడ్డి బయపడుతున్నాడన్నారు.

రేవంత్ రెడ్డి పిరికోడు.. మాటలు ఎక్కువ చెప్తాడు కానీ.. సవాలు స్వీకరించే దమ్ములేదు అన్నారు కేటీఆర్.మల్కాజ్‌గిరిలో పోటీ చేయాలని నేను విసిరిన సవాలు పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పారిపోయాడని…నా సవాలు పైన ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి భయంతో మాట్లాడడం లేదు అన్నారు. మల్కాజ్‌గిరిలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ బలాన్ని చూసి ముఖ్యమంత్రి మౌనం వహించారు…రేవంత్ రెడ్డి సెక్రటేరియట్లో లంక బిందెల సంగతేమో కానీ… హైదరాబాద్ నగరంలో ఖాళీ బిందెలు కనిపిస్తున్నాయన్నారు.

లంకెల బిందెల కోసం తట్ట, పారాలు పట్టుకొని, అర్ధరాత్రి చీకట్లో కరుడుగట్టిన దొంగలు తిరుగుతారు…ఇంత అడ్డగోలుగా మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడం పట్ల ప్రజలు సిగ్గుపడుతున్నారన్నారు.రాహుల్ గాంధీ దేశమంతా తిరిగి… నరేంద్ర మోడీని చౌకీదారు చోర్ హై అంటే రేవంత్ రెడ్డి మాత్రం మా బడే భాయ్ అంటున్నాడన్నారు.అదాని ఫ్రాడ్ అని రాహుల్ అంటే… రేవంత్ రెడ్డి హమారా ఫ్రెండ్ హై అంటున్నాడని…మా తెలంగాణ మాడల్ కాదు… గుజరాత్ మోడల్ చేస్తా అని రేవంత్ రెడ్డి అంటుండన్నారు.

గుజరాత్ మోడల్ అంటే గోద్ర హింస చేస్తారా… బుల్డోజర్లు తీసుకొచ్చి పేద ప్రజల పైకి నడిపిస్తాడా రేవంత్ రెడ్డి చెప్పాలి,నువ్వు రాహుల్ గాంధీ మనిషివా… నరేంద్ర మోడీ మనిషివా… బీజేపీ మనిషివా… కాంగ్రెస్ నేతవా… రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు. ఒక్క ఓటు కాంగ్రెస్ కు వేసినా, అది నేరుగా బిజెపికి లాభం జరుగుతుందని…30- 40 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి బిజెపిలోకి పోయేందుకు రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి బిజెపిలోకి వెళ్తాడు ఇదే జరుగుతుందిదని…ఈ అంశం పైన రేవంత్ రెడ్డి సమాధానం చెప్పమంటే సమాధానం చెప్పట్లేదన్నారు.

రేవంత్ రెడ్డి తిరగని పార్టీ దేశంలో లేదని..ఏబీవీపీ నుంచి టిఆర్ఎస్ కి, టిఆర్ఎస్ నుంచి టీడీపీకి, టిడిపి నుంచి కాంగ్రెస్ కి, కాంగ్రెస్ నుంచి మళ్లీ బిజెపి మాతృ సంస్థకి వెళ్తాడన్నారు. అరవింద్ కేజ్రీవాల్ ని అరెస్ట్ చేస్తే రాహుల్ గాంధీ అన్యాయం అంటాడు కానీ అదే కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేస్తే రేవంత్ రెడ్డి మాత్రం కరెక్టే అంటాడని..రాహుల్ గాంధీ కరెక్టా లేదా రేవంత్ రెడ్డి కరెక్టా అనేది కాంగ్రెస్ చెప్పాలన్నారు. ఆరు గ్యారంటీలు పోయినవి… ఆరు గారఢీలు మోపైంది…రేవంత్ రెడ్డి స్కాములు, స్కీముల, ట్యాపింగ్ పేర్లతో డ్రామాలు ఎందుకు,పాలన చేతకావడం లేదు కాబట్టే లీకు వీరుడిగా మారిండన్నారు.

Also Read:రహస్యంగా పెళ్లి చేసుకున్న హీరో సిద్ధార్థ్-అదితి

- Advertisement -