బీఎస్పీలోకి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్..

76
rs

మాజీ ఐపీఎల్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇవాళ బీఎస్పీలో చేరనున్నారు. నల్గొండలోని ఎన్జీ కళాశాల మైదానంలో జరిగే బహిరంగసభలో బీఎస్పీలో చేరనున్నారు ప్రవీణ్ కుమార్. బీఎస్పీ జాతీయ కోఆర్డినేటర్‌, రాజ్యసభ ఎంపీ రాంజీ గౌతమ్‌ ఆధ్వర్యంలో పార్టీలో చేరనున్నారు.

ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి నల్లగొండ సభకు రావాలని విజ్ఞప్తులు చేస్తున్నారు. వాహనాలను సొంతంగా సమకూర్చుకోవాలని, భోజన ఖర్చు కూడా స్వచ్ఛందంగా భరిస్తూ రావాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలకు ఇన్‌చార్జిలను నియమించి జనసమీకరణ చేశారు.

ఎన్జీ కళాశాల మైదానంలో బహిరంగ సభ నిర్వహించుకునేందుకు అనుమతివ్వాలని జిల్లా ఎస్పీకి దరఖాస్తు చేసుకున్నారు. అక్షరం, ఆర్థికం, ఆరోగ్యం అంశాలే ఎజెండాగా ప్రవీణ్‌కుమార్‌ బీఎస్పీలో చేరనున్నారు.