అద్భుత ప్రదర్శన కనబర్చావు:అదితిపై కేటీఆర్ ప్రశంసలు

248
minister
- Advertisement -

భార‌తీయ గోల్ఫ‌ర్ అదితి అశోక్‌ పై ప్రశంసలు గుప్పించారు. మ‌హిళ‌ల వ్య‌క్తిగ‌త స్ట్రోక్ ప్లేలో అదితికి నాలుగ‌వ స్థానం ద‌క్కించుకోని తృటిలో పతకాన్ని కొల్పోగా అదితి అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌పై రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల‌శాఖ మంత్రి కేటీఆర్ ప్ర‌శంస‌లు కురిపించారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆయ‌న స్పందిస్తూ.. ఒలింపిక్స్‌లో తృటిలో ప‌త‌కాన్ని కోల్పోయి ఉండ‌వ‌చ్చు. కానీ అదితి

అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌ను క‌న‌బ‌రిచింది. యువ అదితి అశోక్ అద్భుత‌మైన ఆట‌తీరుకు ఇవే మా శుభాకాంక్ష‌లు అని పేర్కొన్నారు. టోక్యో క్రీడ‌ల్లో అదితి అద్భుత ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చింది అదితి. ఊహించ‌ని రీతిలో ఆమె దూసుకువెళ్లింది. మూడ‌వ రౌండ్ వ‌ర‌కు పూర్తి ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించిన గోల్ఫ‌ర్ అదితి అశోక్‌.. చివ‌ర్లో కాస్త త‌డ‌బ‌డింది. వ‌రల్డ్ ర్యాంకింగ్‌లో 200వ స్థానంలో ఉన్న అదితి.. గోల్ఫ్‌లో అంచనాల్లేకుండా బరిలోకి దిగి ఒక్కో రౌండ్‌ను అధిగమిస్తూ ప్రపంచ ర్యాంకు ప్లేయర్లకు షాకులిచ్చింది.

- Advertisement -