రచయిత అనంత శ్రీరామ్‌పై పీఎస్‌లో ఫిర్యాదు

237
sriram
- Advertisement -

నాగ శౌర్య, రీతు వర్మ జంటగా నటిస్తున్న ఫ్యామిలీ డ్రామా “వరుడు కావలెను”. ఈ మూవీ లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో రూపొందుతున్న తెలుగు రొమాంటిక్ కామెడీ చిత్రం. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు. రీసెంట్ గా ఈ చిత్రం నుంచి “దిగు దిగు దిగు నాగ” అనే సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ రాగా ఇక ఇందులో ప్రయోగించిన పదజాలంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ పాటలు నాగదేవత కించపరిచే విధంగా , హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందంటూ బిజెపి మహిళా మోర్చా నాయకురాలు బిందు రెడ్డి అనంత శ్రీరామ్ పై కేసు నమోదు చేశారు. నెల్లూరు పోలీస్ స్టేషన్ లో ఆయనపై ఫిర్యాదు చేశారు.

వరుడు కావలెను సినిమాను బ్యాన్‌ చేయాలని కోరుతూ శనివారం బాచుపల్లి మండల తహసీల్దార్‌ కార్యాలయం వద్ద రాష్ట్రీయ ధర్మ రక్షాదళ్‌ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు నరేంద్ర చౌదరి మాట్లాడుతూ ఈ సినిమాలో ‘దిగు దిగు దిగు నాగ’ పాట హిందువుల మనోభావాలను కించపరిచేలా ఉందని, ఆ పాటను వెంటనే తొలగించి బేషరుతుగా చిత్ర దర్శక, నిర్మాతలు క్షమాపణలు చెప్పాలని, లేనిపక్షంలో సినిమా రిలీజ్‌ను అడ్డుకుంటామని హెచ్చరించారు.

- Advertisement -