ఆగస్టు 8న బీఎస్పీలోకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్!

102
rs

వీఆర్ఎస్ తీసుకున్న ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయ ఆరంగేట్రానికి ముహుర్తం ఖరారైంది. ఆగస్టు 8న నల్గొండ వేదికగా బీఎస్పీ కండువా కప్పుకొనున్నారు.నల్గొండలోని ఎన్‌జీ కాలేజీ గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగసభలో, బీఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త రాంజీ గౌతం సమక్షంలో.. పార్టీలో చేరనున్నారు ప్రవీణ్‌కుమార్‌.

ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్వేరోస్‌, మద్దతుదారులు, అభిమానులు హాజరుకానున్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా తనకు మద్దతిచ్చే వారితో సమావేశాలు నిర్వహించారు ప్రవీణ్ కుమార్‌. పెద్ద ఎత్తున తన మద్దతుదారులతో కలిసి బీఎస్పీలో చేరనున్నారు.

ప్రవీణ్ కుమార్‌ ..బీఎస్పీలో చేరికపై యూపీ మాజీ సీఎం, బీఎస్పీ చీఫ్ మాయవతి వెల్లడించిన సంగతి తెలిసిందే. తెలంగాణలో పార్టీ బలోపేతంపై దృష్టిసారిస్తామని తెలిపారు మాయావతి. కొత్త పార్టీ ఏర్పాటు చేస్తారనే ప్రచారం ఓవైపు జరిగినా.. అభిమానుల అభిప్రాయాల మేరకు ఆయన బీఎస్పీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.