బర్త్ డే…మొక్కలు నాటిన సీపీఐ నారాయణ

141
cpi narayana

పుట్టినరోజు, పెళ్లి రోజు లాంటి వేడుకలకు, హంగు ఆర్భాటాలకు దూరంగా ఉండే కమ్యూనిస్టు నాయకులను సైతం గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం ఆకర్షిస్తు వారు మొక్కలు నాటి వారి చేత మన్నలను పొందుతుంది. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా తన పుట్టిన రోజు పురస్కరించుకుని తన స్వగ్రామం చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం ఆయనంబాకం గ్రామంలో లో మొక్కలు నాటారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం గ్రామస్తులు ప్రతి ఒక్కరు ఈ బృహత్కర కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఇంత అద్భుతమైన కార్యక్రమం చేపట్టి ముందుకు తీసుకుపోతున్న రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ కి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.